కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ రోజు నుండి ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ఈ రోజు నుండి కలర్స్ ఛానల్ లో బిగ్ బాస్ 7 ప్రారంభం కానుంది. దీనికి వ్యాఖ్యాతగా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా ఈ షో ను సల్మానే హోస్ట్ చేశాడు. ఇటీవల సల్మాన్ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. చాలాకాలం నుంచి తెరమీద కనిపించని సల్లూ భాయ్ ని బుల్లితెరమీద చూడటం సంతోషమని బాలీవుడ్ సినీ జనాలు చెప్తున్నారు. ఇందులో మరో విశేషమేమంటే ఈసారి సీజన్ లో షారూఖ్ ఖాన్ ను అతిథిగా పిలిచే అవకాశముందని సమాచారం. అదీ సల్లూ భాయ్ స్వయంగా షారూఖ్ ఖాన్ ను ఆహ్వానించబోతున్నాడని తెలుస్తోంది. అయితే సల్మాన్ వెర్షన్ వేరుగా వుంది. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్  ఒక వేదికగా నిలుస్తుంది. ఇక్కడ తన సినిమాని ప్రమోట్ చేసుకోవచ్చు. అందుకు నేను అతను వస్తే సంతోషమే అని ఒక కార్యక్రమంలో చెప్పాడు. ఇందులో ఏది నిజమో సమయమే తేల్చి చెప్పాలి.

0 comments:

Post a Comment

 
Top