అందాల భామ తాప్సి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. పెళ్లి మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముక్కు ముఖం తెలియని వ్యక్తితో పెళ్లి పేరుతొ జత చేయడం నాకు నచ్చదు. పెళ్లి విషయంలో భారతీయ సంప్రదాయం నాకు నచ్చదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ వ్యక్తితో రెండు సంవత్సరాలు సహజీవనం చేసి ఆ వ్యక్తి అభిరుచులు, అభిప్రాయాలు నాకు నచ్చితేనే పెళ్లి గురించి ఆలోచిస్తాను. సహజీవనం అనగానే ఏదో తప్పు చేసేస్తాననుకుంటే పొరపాటు. మా అమ్మా నాన్నలు నాకు ఇచ్చిన స్వేచ్చ ను దుర్వినియోగం చేయను. వారికి చెడ్డ పేరు తీసుకు రాను అంటోంది. ఈ సహజీవనం బాలీవుడ్ లో పెద్దగా పట్టించుకోక పోయినా మన టాలీవుడ్ ని మాత్రం ఉలిక్కిపడేలా చేస్తుంది. తాప్సి స్టేట్ మెంట్ కూడా అటువంటి సంచలనాన్నే సృష్టించింది.

0 comments:

Post a Comment

 
Top