ఏ మాయ చేసావే చిత్రంతో మాయ చేసిన సమంతా ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో వరుస
అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకటి అరా సినిమాలు తప్ప ఇప్పటివరకు సమంతా చేసిన
సినిమాలన్నీ విజయాన్ని సాధించాయి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన అత్తారింటికి
దారేది చిత్రం విడుదలకు సిద్ధమైంది. యన్ టి ఆర్ తో చేసిన రామయ్యా
వస్తావయ్య చిత్రం కూడా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. అక్కినేని
కుటుంబ చిత్రం మనంలో నాగ చైతన్యతో జతకడుతోంది. తమిళంలో సూర్యతో ఒక సినిమా,
ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. కెరీర్ పరంగానే కాక
వ్యక్తిగతంగానూ సంతోషంగానే ఉంది. ఈ సంవత్సరం ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో రెండు
ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి ఉత్తమ నటి
అవార్డ్ అందుకున్న ఘనత ఒక్కప్పుడు రేవతి దక్కించుకోగా దాదాపు 21 సంవత్సరాల
తర్వాత సమంతా కు ఆ అవకాశం దక్కింది. అందుకే అందరూ అమ్మో సమంతా వావ్ అంటూ
నోర్లు వెళ్ళబెడుతున్నారు.
Home
»
»Unlabelled
» వావ్ సమంతా
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment