భారతీయ చలనచిత్ర చరిత్రలో సుదీర్ఘమైన ముద్దు అమీర్ ఖాన్ ఖాతాలో చేరిపోయింది. మున్నాభాయ్ ఎంబిబియస్, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహిస్తున్న చిత్రం పి.కె.(పీకే). అమీర్ ఖాన్, అనుష్కశర్మ లు నాయకా నాయికలు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, అనుష్కశర్మల మధ్య ఓ ముద్దు సన్నివేశం వుందట. ఈ ముద్దు భారతీయ చలనచిత్ర చరిత్రలో సుదీర్ఘమైన ముద్దట. 1997లో అమీర్ ఖాన్, కరిష్మాకపూర్ నాయకా నాయికలుగా వచ్చిన రాజా హిందూస్థానీ చిత్రంలో కూడా ముద్దు సన్నివేశం వున్నా, అది ఇంత సుదీర్ఘమైనది కాదట. అంతే కాక ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో వున్న ఏ ముద్దు సన్నివేశమూ ఇంత సుదీర్ఘమైనది కాదట. అందుకే సుదీర్ఘమైన ముద్దు అమీర్ ఖాన్ ఖాతాలో చేరిపోయిందని బాలీవుడ్ సినీ పండితులు చెప్తున్నారని సమాచారం.

0 comments:

Post a Comment

 
Top