ఎంతమంది కుర్ర హీరోలు వచ్చినా, రజనీకాంత్ స్థాయి మాత్రం రజనీకాంత్ దే అని నిన్న విడుదలైన కొచ్చాడయాన్ టీజర్ మరోసారి రుజువు చేసింది. నిన్న విడుదలైన ఈ టీజర్ ను ఇప్పటికి 1 మిలియన్ వీక్షకులు చూశారు. అదీ ఒక్క రోజులో. ఇంకా ఈ నెల 12వ తారీఖు ఈ సూపర్ స్టార్ పుట్టినరోజు. ఆ రోజు అభిమానులు మరెంతమంది ఈ టీజర్ చూడబోతారో అనేది ఎవరి అంచనాలకు అందటం లేదు. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, దీపికా పడుకొనె, శోభన, శరత్ కుమార్, నాజర్, జాకీష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తోందట చిత్ర యూనిట్. ఈ సంఘటనతో రజనీకాంత్ ను బీట్ చేసేవారు లేరని తెలుస్తోందని కోలీవుడ్ సినీ పండితులు నొక్కి వక్కాణిస్తున్నారు.

0 comments:

Post a Comment

 
Top